ది ఇండియా న్యూస్7:మహబూబాబాద్:- అండర్ 16 క్రికెట్ టోర్నమెంట్ కి ఎన్నికైన మహబూబాద్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ హెచ్సీఏ అండర్ 16 పాఠశాలల మరియు కళాశాలల టోర్నమెంట్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపికైన మహబూబాబాద్ క్రికెట్ అండర్ 16 క్రీడాకారులు భామనపల్లె ధర్మచరణ్ రెడ్డి, వెల్ది చిన్మయి తేజ్, మామిండ్ల పల్లి తరుణ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ ఆధ్వర్యంలో నేటి నుంచి ఆగస్టు 16 నుండి జరుగుతున్న అండర్ 16 అంతర్ పాఠశాలల మరియు కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపికైన మానుకోట పట్టణానికి చెందిన భామనపల్లె ధర్మచరణ్ రెడ్డి, వెల్ది చిన్మయి తేజ్, మామిండ్లపల్లి తరుణ్ ఎంపికైనట్టు మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి బి.అజయ్ సారధి రెడ్డి తెలిపారు. మానుకోట నుండి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ద్వారా శిక్షణ పొంది ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు, హైదరాబాద్ లో జరిగే అండర్ 16 క్రికెట్ టోర్నమెంట్ లో ఉమ్మడి వరంగల్ జట్టుకు ఎంపికైన వారు టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరచాలని, రానున్న రోజుల్లో మానుకోట ప్రాంతం నుంచి ఎంతోమంది క్రికెట్ క్రీడాకారులు తమ యొక్క ప్రతిభను మెరుగుపరచుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. మానుకోట పట్టణానికి చెందిన ఎంపికైన క్రీడాకారులు ధర్మచరన్ రెడ్డి, చిన్మయి తేజ్, తరుణ్ హైదరాబాదులో జరుగుతున్న టోర్నమెంట్ లో అద్భుత ప్రతిభ కనబరిచి రానున్న రోజుల్లో రంజీ ఐపీఎల్ భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం వహించేలా మంచిగా ఆడి మానుకోటకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వీరు ఎంపిక పట్ల మహబూబాద్ క్రికెటర్ అసోసియేషన్ కోచ్ మెతుకు కుమార్, సహాయ కోచ్ తోట వినయ్ కుమార్, మెంబర్ అయిలి సంతోష్ సంతోషం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.