భారత ఐటీ విప్లవ పితామహులు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ

0
63

– మరిపెడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దిన్

– పట్టణ కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ది ఇండియా న్యూస్7:మరిపెడ:-

భారత ఐటీ విప్లవ పితామహులు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ భారతదేశ 6 వ ప్రధాన మంత్రిగా సేవలందించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ చిరస్మరనీయులని కొనియాడారు మరిపెడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దిన్, ఆయన ఆధ్వర్యంలో రాజీవ్ గాంధి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం యొక్క ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు, శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుగులోత్ రవి నాయక్ మండల యువ నాయకులు కుడితి నరసింహ రెడ్డి, మండల మున్సిపల్ నాయకులు బోర గంగయ్య, కొంపెల్లి సురేందర్ రెడ్డి, 9 వ వార్డు ఇంచార్జి కారంపూడి ఉపేందర్, అలువాల ఉపేందర్, గుండగాని వెంకన్న, సుధాకర్ నాయక్, దేవరశెట్టి కృష్ణమూర్తి, దేవరశెట్టి లక్ష్మీనారాయణ,బుర్ర నవీన్ యాదవ్, ch సాయి బాబా,బానోత్ మహేష్, జాటోత్ రమేష్,వెంకట్ సాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here