ది న్యూస్ ఇండియా7:అనంతపూర్:-
అనంతపూర్ జిల్లాలో రాయదుర్గం మండలంలో అవయవ దాన దినోత్సవం సందర్భంగా తన అవయవాలు దానం చేస్తూ రిజిస్ట్రేషన్ చేసిన సోషల్ సర్వీసర్ దగ్గడ్ ప్రేమ్ పునర్జన్మంటే మళ్ళీ పుట్టడం కాదు అవయవాలు దానం చేయడం నేను చనిపోయిన కూడా నా అవయవాలు మట్టిలో కలవడం ఇష్టం లేక ఇంకో మనిషి దేహంలో బతకాలి అని ప్రేమ్ తెలియజేశారు. అలాగే యువత అందరూ కూడా అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు అవయవ దానం చేసిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లంచనాలతో అంతక్రియలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఆదేశాలు అందించింది అవయవ దానం చేయండి ప్రాణదాతలు కండి రాబోయే రోజుల్లో అవయవ దానం పై మరెన్నో కార్యక్రమాలు చేసి యువతను పెద్ద ఎత్తున ముందుకు తీసుకొస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దగ్గడ్ సేవా ట్రస్ట్ టీమ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.