“మయన్మార్‌లో భూకంప విధ్వంసం: బ్యాంకాక్ వరకు ప్రకంపనలు”
మయన్మార్‌లో సంభవించిన భూకంపం తీవ్రత థాయ్‌లాండ్‌ను కుదిపేసింది. భూకంప తీవ్రతకు బ్యాంకాక్‌లోని బిల్డింగ్‌లు నేలమట్టం అయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు
ది ఇండియా న్యూస్7 :
వరుస భూకంపాలు మయన్మార్‌ను స్తంభింపజేశాయి. ఈ శుక్రవారం, మార్చి 28, 2025న జరిగిన రెండు అతిపెద్ద భూకంపాలు మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను కూడా వణికించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపాల తీవ్రత 7.4 మరియు 6.8గా నమోదైంది. ఈ భూకంపాల కేంద్రం సాగింగ్ సమీపంలో ఉండటంతో, మయన్మార్‌లోని మండలే సమీపంలో ఉన్న ప్రసిద్ధ అవ బ్రిడ్జ్ ఇర్రవడ్డి నదిలో కూలిపోయింది. ఈ ప్రకంపనల ధాటికి అనేక భవనాలు శిథిలమయ్యాయి, దీంతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు.
ఈ భూకంపాల తీవ్రత అంతటిదని, బ్యాంకాక్‌కు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోని ఒక అతిపెద్ద భవనం కూడా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 40 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో భవనాలు కదిలిపోతూ, భయాందోళనలో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. థాయ్‌లాండ్‌తో పాటు, చైనాలోని నైరుతి యునాన్ ప్రాంతంలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి.
బ్యాంకాక్‌లోని చాటుచక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనం కూలిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని హోటళ్లను మూసివేశారు, ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగెత్తారు. భూకంపానికి సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా షేర్ చేయబడుతున్నాయి. అయితే, బ్యాంకాక్‌లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని సమాచారం. ఈ విపత్తు ప్రాంతాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నప్పటికీ, సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి.