సుమయ రెడ్డి నటించిన ‘డియర్ ఉమ’ టీజర్ విడుదల
ది ఇండియా న్యూస్7 :
ఈ నెల 18న సినిమా గ్రాండ్ రిలీజ్తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా బహుముఖ పాత్రలు పోషిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ ఉమ’ (Dear Uma). ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 18న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పృథ్వీ అంబర్ (Prithvi Amber) కథానాయకుడిగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ టీజర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు రాసి దర్శకత్వం వహించారు. రథన్ సంగీతాన్ని సమకూర్చగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను రాబట్టాయి. ఇప్పుడు విడుదలైన టీజర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.టీజర్‌ను ఆవిష్కరించిన శివ నిర్వాణ మాట్లాడుతూ, “డియర్ ఉమ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాకుండా, ఒక మంచి సందేశాన్ని అంతర్లీనంగా కలిగి ఉన్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని నమ్ముతున్నాను” అని అన్నారు.టీజర్ విశేషాలు చూస్తే, “గుడిలో దేవుడి వద్ద చేసే ప్రార్థనల కన్నా.. హాస్పిటల్‌లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనలే ఎక్కువ” అనే డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది. “రెండు జీవితాలు.. రెండు ప్రపంచాలు.. రెండు భావోద్వేగాలు.. ఇద్దరి ప్రేమలు.. ఒక హృదయం.. ఒక యుద్ధం” అనే వాక్యాలు భావోద్వేగంతో కూడిన కథను సూచిస్తాయి. అలాగే, “పేషెంట్స్‌కి, డాక్టర్లకు మధ్య మీలాంటి కమిషన్ ఏజెన్సీలు, బ్రోకర్లు ఉండకూడదు సర్.. దీని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను” అనే సంభాషణలు సినిమాలోని ఉద్విగ్నతను, సామాజిక సందేశాన్ని తెలియజేస్తాయి. ఈ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేలా ఉన్నాయి.సుమయ రెడ్డి మాట్లాడుతూ, “డియర్ ఉమ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించాము. ఇందులో ప్రేమ, కుటుంబ బంధాలు, యాక్షన్ డ్రామా అన్నీ కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ నెల 18న విడుదల కానున్న మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాము” అని తెలిపారు.