తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం

0
82

ప్రతి తల్లి తమ బిడ్డకు తల్లి పాలు అందించేలా అధికారులు అవగాహన పరచాలి: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ది ఇండియా న్యూస్ 7:- మహబూబాబాద్ జిల్లా

గురువారం మహబూబాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలోని ప్రాథమిక పాటశాల అంగన్వాడీ కేంద్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. తల్లి పాల వారోత్సవ కార్యక్రమాలను జిల్లాలో నిర్వహించేందుకు అంగన్ వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతపై ప్రజలకు తెలియజేయాలని, అధికారులు ఖచ్చితమైన ప్రణాళికతో ఉన్నారని, శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సీజనల్ వ్యాదులలో ప్రత్యేకంగా చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలపై వైద్యాధికారులు దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

వైద్యశాఖ, అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ రాజ్ వారు, విద్యాశాఖ వారు, అదే విధంగా మున్సిపల్ పరిధిలో మునిసిపల్ కమిషనర్లు సమన్వయంతో సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. ఉన్నతాధికారుల సలహా, సూచనలు పాటించి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి బాయి మాట్లాడుతూ తల్లి పాలతోనే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని, బిడ్డ పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించాలన్నారు. తల్లిపాలను మించిన ఔషదం లేదని అన్నారు. దీంతో బిడ్డ రక్తహీనత బారినపడకుండా ఉంటుందని తొలిదశలో శిశువును అంటువ్యాధుల నుంచి కాపాడటమే కాకుండా మనోవికాసానికి తోడ్పడతాయని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశం అని, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని, తల్లి పాల ప్రాముఖ్యతను వివరించేందుకు జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని కళావతి భాయ్, డి.డబ్ల్యూ.ఓ వరలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్, ఎమ్మార్వో భగవాన్ రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్స్ వడ్డెబోయిన శ్రీనివాస్, ఒబిలి శెట్టి రామకృష్ణ, కౌన్సిలర్ మారినేని శ్రీదేవి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మార్నేని కిరణ్, ఇంచార్జ్ డిపి హెచ్ఎన్ఓ మంగమ్మ, సూపర్వైజర్ రత్నకుమారి, అంగన్వాడి సూపర్వైజర్స్, ఆశాలు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here