బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్

0
56

ది ఇండియా న్యూస్7:మరిపెడ:- 

 

బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ హుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడిన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని గోపా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో గోపా మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా గోపా, గౌడ్ సంఘం నాయకులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ సర్ధార్ సర్వాయి పాపన్న మొట్టమొదటి బహుజన వీరుడని, నాటి పాలకుల నిరంకుశపాలనపై యుద్ధం చేసిన మోధుడని, రాచరి కపు దోపిడిని వ్యతిరేకంచిన ధీశాలి అని కొనియడారు. మొగల్ సామ్రా జాన్ని ఎదిరించి గోల్కొండ కోటను జయించిన వీరుడు, భావితరకు తెలిసే విధంగా పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో లిఖిం చాలన్నారు. పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం దిశగా గౌడ సోదరులంతా ఎదగాలన్నారు. సర్వాయి పాపన్న జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని, హైదరాబాద్ ట్యాంక్బండ్పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయా లని తెలిపారు. పాపన్న గౌడ్ పుట్టిన జిల్లా జనగాంకు పాపన్న గౌడ్ జిల్లాగా పేరు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ గోపా డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్, బెల్లంకొండ శ్రీనివాస్, చిత్తనూరి శ్రీనివాస్, గంధసిరి అంబరిష, చీకటి శ్రీనివాస్, గంధసిరి కృష్ణ, గుండగాని వేణు, గంధసిరి రవి, గంధసిరి వేణు, గుండగాని సుందర్, బయగాని రామ్మోన్, నరేష్, గంధసిరి భిక్షపతి, గంధసిరి రమేష్, సంపత్, లింగాల మహేష్, లింగన్న, మోహన్, సతీష్, మనోజ్, ప్రభాకర్, సంతోష్, మల్లేశం, గంధసిరి అశోక్, సోమన్న, పెద్దగాని రమేష్, రవి,గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here